సైనసైటిస్, మైగ్రేన్... సమస్య ఏదైనా భరించలేని తలనొప్పి. ఏ పనీ చేసుకోలేకపోతారు. తలనొప్పి మాత్రలు వేసినా ఫలితం శూన్యం. నిజానికి ఈ సమస్యలకు హోమియో వైద్యవిధానంలో మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక, తెలిసినా నిర్లక్ష్యం చేత తలనొప్పితో బాధపడుతూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఒక్కసారి హోమియో చికిత్స తీసుకుంటే ఈ సమస్యల నుంచి వారికి శాశ్వత విముక్తి లభిస్తుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్. వైరల్, బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా సైనస్‌లలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్ అంటారు. ముక్కు, కళ్ల చుట్టూ ఉండే గదులను సైనస్‌లు అంటారు. మనం శ్వాస పీల్చినపుడు గాలి ముక్కు నుంచి సైనస్‌లలోకి వెళుతుంది. పీల్చే గాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి. ప్రధాన కారణాలు సైనస్ గదులలో మ్యూకస్ పేరుకుపోయినపుడు బాక్టీరియా, ఇతర క్రిములు పెరగడం, శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావటం వల్ల సైనస్‌లకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. చాలాకాలం పాటు ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. ...